త్రివిక్రమ్ కోసం మరోసారి తారక్.. ఈసారి వర్కవుట్ అయ్యేనా..?

త్రివిక్రమ్ కోసం మరోసారి తారక్.. ఈసారి వర్కవుట్ అయ్యేనా..?

Published on Nov 25, 2026 2:00 AM IST

ఒక ఫ్లాప్ దర్శకుడి ట్యాలెంట్‌ను ఎప్పటికీ తగ్గించలేదు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఎన్టీఆర్ ఆయనకు అండగా నిలిచి ఈ విషయాన్ని బలంగా చాటాడు. ఒక్క ఓటమితో దర్శకుడిని అంచనా వేయకూడదని ఎన్టీఆర్ నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఘనవిజయం సాధించి త్రివిక్రమ్‌కు అవసరమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.

ఇప్పుడు కొన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైంది. ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో త్రివిక్రమ్ ఫామ్‌పై మరోసారి చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో, ఈ ఇద్దరూ కలిసి ఓ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని త్రివిక్రమ్ చూస్తుండగా, ఎన్టీఆర్ మరోసారి ఆయనపై పూర్తి నమ్మకం ఉంచాడు. గతంలో మాదిరిగానే ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

తాజా వార్తలు