ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

Published on Nov 25, 2026 7:00 AM IST

Aadarsha Kutumbam

విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేక నిరాశపరిచింది. అయితే, థియేటర్లలో ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాను మిస్ అయిన ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన కమింగ్ సూన్ జాబితాలో ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ, ఈ శుక్రవారం(నవంబర్ 27) నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మరి ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు