బ్రేకింగ్ : ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ !

Published on May 10, 2021 3:27 pm IST

ఎన్టీఆర్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా తెలియజేశారు. ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘‘కరోనా పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్‌ గా తేలింది. ఐతే ప్రస్తుతానికి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగున్నాను. నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రెజెంట్ నేను, నా ఫ్యామిలీ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. కాబట్టి, ఈ మధ్య నన్ను కలిసిన వారందరు కూడా దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను, అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని ఎన్టీఆర్ మెసేజ్ పోస్ట్ చేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఇలా వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది. కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ పెద్ద సమస్య అయిపోయింది. పైగా స్టార్స్ కు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో మేకర్స్ కి ఏం చేయాలో అర్ధం కావడంలేదు. మళ్ళీ షూటింగ్స్ కి మరో రెండు మూడు నెలలు వరకూ బ్రేక్ ఇవ్వాల్సిందేనా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :