దేవీశ్రీ కోసం మరోసారి సింగర్ కానున్న ఎన్.టి.ఆర్

దేవీశ్రీ కోసం మరోసారి సింగర్ కానున్న ఎన్.టి.ఆర్

Published on Nov 25, 2015 10:30 AM IST

Nannaku-Prematho
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్ర టీం ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే.. ఎన్.టి.ఆర్ నటుడిగానే కాకుండా తనకున్న మక్కువతో ఇప్పటికే తన సినిమాలలో ఓ నాలుగు పాటలు పాడాడు. యమదొంగలో ‘ఓలమ్మి తిక్కరేగిందా’, కంత్రిలో ‘123 నేనొక కంత్రి’, అదుర్స్ లో ‘చారి’ మరియు రభసలో ‘రాకాసి రాకాసి’ పాటలను పాడాడు. ఈ నాలుగు సాంగ్స్ అప్పట్లో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇదే కోవలోనే ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా ఓ పాటని పాడటానికి సిద్దమయ్యాడు. ఇటీవలే దేవీశ్రీ ప్రసాద్ ఎన్.టి.ఆర్ ని కలిసి ఓ పాట ఆయన పాడితే బాగుంటుందని అప్రోచ్ అయితే ఎన్.టి.ఆర్ కూడా దానికి సముఖత చూపినట్లు సమాచారం. దాంతో దేవీశ్రీ ప్రసాద్ ఫుల్ ట్యూన్ మరియు పాటని సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఆ పాట రెడీ అయ్యాక ఎన్.టి.ఆర్ ఆ పాటని పాడనున్నారు. ఎన్.టి.ఆర్ తన 25వ సినిమా ద్వారా మరోసారి సింగర్ గా కూడా అభిమానులను మెప్పించనున్నాడు.

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. డిసెంబర్ 3వ వారం కల్లా సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు