మరో చిత్రం ఆడియోను లాంచ్ చేయనున్న ఎన్టీఆర్ !

Published on Jul 24, 2018 11:56 am IST

యంగ్ హీరో రాహుల్ విజ‌య్ హీరోగా ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్స్‌ కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేశారు ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఆయన కుమారుడే రాహుల్ విజ‌య్‌. ఇప్పటికే ఈ చిత్రానికి నాని వాయిస్ అందిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రం ఆడియోను లాంచ్ చేసి ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో క్రేజ్ ను తీసుకురానున్నారు. కాగా చిత్రబృందం జులై 28వ తేదీన శనివారం ఎన్టీఆర్ తన సినిమా ఆడియోను లాంచ్ చేయనున్నారని అధికారికంగా ఈ రోజు పోస్టర్ ను విడుదల చేసింది.

రాహుల్ సరసన కావ్యా థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడు రాము కొప్పుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి దివ్య విజయ్‌ నిర్మాతగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :