సాంగ్ షూట్ తర్వాత డబ్బింగ్ అంటున్న ఎన్.టి.ఆర్

సాంగ్ షూట్ తర్వాత డబ్బింగ్ అంటున్న ఎన్.టి.ఆర్

Published on Dec 17, 2015 6:10 PM IST

Nannaku-Prematho
గత 15 రోజులుగా స్పెయిన్ లో మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘నాన్నకు ప్రేమతో’ టీం హైదరబాద్ చేరుకుంది. ఈ స్పెయిన్ షెడ్యూల్ తో దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక మిగిలి ఉన్న పాచ్ వర్క్ సీన్స్ ని త్వరలోనే హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ ఓ సాంగ్ షూట్ కోసం సెట్ ని డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ షూట్ ని కూడా ఎన్.టి.ఆర్ ఫినిష్ చేయనున్నాడు. టాకీ పార్ట్ పూర్తవడంతో సుకుమార్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్పీడప్ చేసాడు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని శబ్దాలయా స్టూడియోస్ లో చెబుతోంది. ఎన్.టి.ఆర్ కూడా బాలన్స్ ఉన్న సాంగ్ షూట్ ని ఫినిష్ చేసెయ్యగానే తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని మోదలు పెట్టనున్నాడు. మరోవైపు ఎడిటింగ్, డిఐ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను అనుకున్న టైంకి ఫినిష్ చేసి ఈ ఏడాది చివర్లో లేదా జనవరి మొదటి వారంలో ఆడియోని రిలీజ్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు