ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్ !

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా ఈ నెల 12 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ లో చినబాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

ఆర్మీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. వినోద్ ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ స్టైల్ లో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు. రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయి.