NTR – Trivikram: ‘గాడ్ ఆఫ్ వార్’ అరాచకం.. థీమ్ పోస్టర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన త్రివిక్రమ్-ఎన్టీఆర్!

NTR – Trivikram: ‘గాడ్ ఆఫ్ వార్’ అరాచకం.. థీమ్ పోస్టర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన త్రివిక్రమ్-ఎన్టీఆర్!

Published on Jun 29, 2026 5:19 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ భారీ మైథలాజికల్ చిత్రం రానుందనే వార్త గతకొంత కాలంగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనే విషయం మాత్రం ఖాయమనే సంకేతాలు అందాయి. ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ మేకర్స్ ఈ కాంబోపై అధికారిక ప్రకటన చేశారు.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మైథలాజికల్ అంశాలతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఓ థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ‘‘శివుడి కుమారుడు, పార్వతి గర్వకారకుడు సుబ్రహ్మణ్య స్వామి’’ అనే క్యాప్షన్‌తో ఆయుధం ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేగాక, సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఈ పోస్టర్‌లో మనకు కనిపిస్తుంది.

పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో యుద్ధం తర్వాత కనిపించే సన్నివేశం మనకు కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా పూర్తి మైథాలజీ నేపథ్యంలో సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.

తాజా వార్తలు