కొరియోగ్రాఫర్ గా మారిన ఎన్టీఅర్?

Published on Jun 20, 2014 4:03 am IST

junior-ntr
యంగ్ టైగర్ ఎన్టీఅర్ కి సినిమాకి సంబంధించిన వివిధ విభాగాలలో మంచి పట్టు ఉంది. ఇదివరకే గాయకుడిగా తన సత్తా చాటిన ఎన్టీఅర్, తను ప్రస్తుతం నటిస్తున్న ‘రభస’ సినిమాలో మరో కొత్త ప్రయోగం చేయనున్నట్టు సమాచారం.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ‘రభస’ సినిమాతో ఎన్టీఅర్ కొరియోగ్రాఫర్ గా మరనున్నాడట. ఈ సినిమాలోని ఒక పాటకి ఎన్టీఅర్ స్వయంగా కోరియోగ్రఫీ చేసుకున్నాడట, ఈ స్టెప్స్ సినిమాకే హైలైట్ అవుతాయని సమాచారం.

సంతోష్ శ్రీనివాస్దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘రభస’ సినిమా ఆగష్టు 14న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :