ఇప్పుడిక ఎన్టీఆర్ వంతు !
Published on Mar 11, 2018 3:28 pm IST


మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. ఇక సావిత్రి సినీ జీవితంలో ముఖ్యులుగా పేర్కొనే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ పాత్రల కోసం నాగ అశ్విన్ ఇదివరకే వాళ్ళ వారసులైన నాగ చైతన్య, జూ.ఎన్టీఆర్ లను సంప్రదించారు.

ఈ సంప్రదింపులు ఫలిచండంతో నాగ చైతన్య తన తాతగారు ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు ఒప్పుకోగా ఇక తారక్ నుండి ఫైనల్ డెసిషన్ వెలువడాల్సి ఉంది. మరి తాతాగారిని దైవ సమానులుగా భావించే తారక్ ఆయన పాత్రను పోషించేందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి. మరోవైపు అభిమానుల నుండి తారక్ ఆ పాత్ర చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో సమంత , విజయ్ దేవరకొండ వంటి వారు కూడ నటిస్తున్నారు.

 
Like us on Facebook