మణికొండలో సందడి చేస్తున్న ఎన్.టి.ఆర్ టీం

Published on Jan 7, 2014 7:56 pm IST

ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘కందిరీగ’ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మణికొండలో వేసిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఫుల్ కామెడీతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎన్.టి.ఆర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇలాంటి కథలని సినీ అభిమానులు పలుసార్లు విజయవంతం చేసారు. ప్రస్తుతానికి ఈ మూవీకి ‘రభస’ అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారు, కానీ చివరికి ఈ టైటిల్ మారే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :