ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో రాశిఖన్నా, నివేత థామస్ లు కథానాయికలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం’ జై లవ కుశ’. తెలుగులో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఈ చిత్రం మలయాళ భాషలో ‘రావణాసురన్’ గా విడుదలకానుంది. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మలయాళంలో మంచి మార్కెట్ ను ఎర్పరుచుకున్నాడు తారక్. మరి త్వరలో విడుదల కానున్న ఈ సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం ఫై హీరో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు .


