నటనకు బాయ్ చెప్పిన మాజీ హీరోయిన్ !

Published on Jun 13, 2021 10:04 pm IST

‘నువ్వు నేను’తో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ అనిత, తన తెరంగేట్రం సినిమాతోనే తెలుగు వారికి బాగా చేరువైంది. ఆ తరువాత కూడా అవకాశాలు బాగానే వచ్చినా.. ఎందుకో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. ఆ మధ్య కొన్ని హిందీ సీరియల్స్ తో ఫుల్ బిజీగా వుంది. అయితే, పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఈ హీరోయిన్,

ఇప్పుడ తన అభిమానుల్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఇటీవల తల్లైన అనిత.. ఇక నటనకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ‘బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా బాబు సంరక్షణ చూసుకోవడం నాకెంతో అవసరం. ఈ క్రమంలోనే ఇకపై సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అంటూ అనిత ప్రకటించింది.

సంబంధిత సమాచారం :