స్పైడర్ నిర్మాత చేతికి ‘2.0’ తెలుగు హక్కులు !

Published on Oct 31, 2018 10:35 pm IST

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘2.0’ చిత్రం విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈచిత్రం యొక్క ట్రైలర్ ను నవంబర్ 3న విడుదల చేయనున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత ఎన్వీఆర్ సినిమా అధినేత ఎన్వీ ప్రసాద్ భారీ ధరకు దక్కించుకున్నారు. గతంలో ఆయన ,మహేష్ బాబుతో ‘స్పైడర్’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్ వీఆర్ సినిమాస్ కు లైకా ప్రొడక్షన్ తో మంచి అనుబంధం వుంది. లైకా నిర్మించిన ‘కాలా , నవాబ్ , కణం’ చిత్రాలను ఎన్వీఆర్ సినిమాస్ తెలుగులో విడుదలచేసింది.

సంబంధిత సమాచారం :