మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం ఏప్రిల్ 24న రీ-రిలీజ్ కానుంది. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శన, మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సినిమా మహిళల భద్రత, వారిపై జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కిన ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలను మోసం చేసేవారికి, వేధింపులకు గురిచేసేవారికి ఎలాంటి శిక్షలు పడతాయనే సందేశాన్ని ఇందులో బలంగా చూపించారు. కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మంచి కథా బలంతో రూపొందిన ఈ చిత్రాన్ని గతంలో మిస్ అయినవారు ఇప్పుడు థియేటర్లలో చూడాలని దర్శకుడు షెరాజ్ మెహదీ కోరారు.
‘స్కై ఈజ్ ది లిమిట్ స్టూడియోస్’ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించిన ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ సంగీతం కూడా అందించారు. ఇందులో విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా నటించగా; తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, నేహా దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందడం విశేషం.


