మంచి పాత్రలలో నటించాలనుకుంటున్నా-సంజయ్ రావు

Published on Mar 1, 2020 1:23 am IST

న‌టుడు బ్ర‌హ్మాజీ వార‌సుడు సంజ‌య్ రావు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం `ఓ పిట్టకథ`. భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగాపరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్ నిర్మించారు. విశ్వంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి హీరోహీరోయిన్లు గా న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యి మార్చి 6న విడుదలవుతోంది. ఈసంద‌ర్భంగా హీరో సంజ‌య్ రావు మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

సంజయ్ రావ్ మాట్లాడుతూ… ‘నేవీ జాబ్ వదిలేసి సినిమాపై మక్కువతో ఇటువైపు వచ్చాను. నటనలో ప్రముఖుల దగ్గర శిక్షణ తీసుకొన్నాను. సినిమాలోకి రావడానికి నాన్నే నాకు స్ఫూర్తి. మంచి నటుడిగా పేరు తెచుకోవాలన్నదే నా తాపత్రయం. ఇక పిట్ట కథ ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు ఈ సినిమలో లవ్ స్టోరీ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నేను పల్లెటూరిలో ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో పనిచేసే యువకుడిగా కనిపిస్తాను. సినిమా అంటే క‌థ‌ను చెప్ప‌డం. పాత్ర‌లతో న‌డిచేది సినిమాలో అన్ని పాత్ర‌లు బావుండాలి. మంచి పాత్ర‌ల్లో న‌టించాలి అనుకుంటాను,’ అన్నారు.

సంబంధిత సమాచారం :