స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్‌లో దర్శకుడు సంపత్ నంది ప్రొడక్షన్ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ ‘ఓదెల 2’. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 17న పాన్ ఇండియా భాషల్లో మంచి బజ్ మధ్య రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది.
బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్‌ను తెచ్చుకుని ఈ సినిమా యావరేజ్ చిత్రంగా నిలిచింది. కమర్షియల్‌గా ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సె్స్ సాధించలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని మే 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా వెల్లడించింది. ఇలా సడెన్‌గా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో తమన్నా అఘోరి పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.