‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ పై పూరి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on May 15, 2021 10:32 pm IST

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ భాగంగా ఈ రోజు ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో.. ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్’‌.. నాగరిక ప్రపంచానికి దూరంగా బతకడం, ఎక్కడో ప్రకృతిలో కలిసిపోయి బతకడం. క్లారిటీగా చెప్పుకుంటే మంచినీళ్లు‌, కరెంటు, గ్యాస్‌, ఇంటర్నెట్‌.. ఇలాంటి ఏ వసతులు లేకుండా బతకడం. కానీ, ఈ గోయింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌ అనేది కేవలం కొంతమంది మాత్రమే చేయగలరు. ఎందుకంటే వీళ్ళు వాళ్ల ఆహారాన్ని వాళ్లే పండించుకుని తింటారు. పశువులు, కోళ్లను పెంచుకుంటూ.. అన్నిరకాల చెట్లతో పాటు ధాన్యం కూడా పండిస్తారు. అప్పుడు అన్ని వాళ్లకు దొరుకుతాయి.

ప్రపంచంలో 35 మిలియన్ల మంది ఇలా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌’ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్లంతా ఆరోగ్యంగా, అలాగే సంతోషంగా కూడా ఉంటారు. మన పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు బతికారు. అందుకే పాత రోజుల్లో మన భూమి ఎంతో పచ్చగా ఉండేది. 100 డైనోసార్లు అడవిలో పుట్టి అదే అడవిలో చనిపోతే ఈ ప్రకృతికి ఏం కాదు. కానీ నలుగురు మనుషులు బతికి చనిపోతే అప్పటికే అడవి సగం నరికేసి ఉంటుంది. అందుకే మనందరం ఆఫ్‌ గ్రీడ్‌ గా జీవించాలి. కరోనా వైరస్‌ లు లాంటి నుంచి దూరంగా సంతోషంగా బతకాలంటే ఇది ఒక్కటే మార్గం. కాబట్టి వెనక్కెళ్లి బతుకుదాం. ముందుకెళ్లి పీకేది ఏమీ లేదు’’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :