నాగార్జున నటించిన ఆఫీసర్ సినిమా పరిస్థితి మరి దారుణంగా ఉంది.ఈ చిత్రం విడుదలైన మూడు రోజులకే ఈ సినిమా ప్రద్రర్శనను ఆపేస్తున్నారు థియేటర్ యజమానులు. దీనికి కారణం లేకపోలేదు ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఫస్ట్ రోజు కోటి రూపాయలను కూడా కల్లెక్ట్ చేయలేదు.
ఇక రెండవ రోజు అయితే కేవలం 11లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందొ అని అందుకే ఈ చిత్రాన్ని చాలా చోట్ల థియేటర్స్ నుండి తొలగించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న’ అభిమన్యుడు’ సినిమాను ప్రదర్శిస్తున్నారు.
బహుశా నాగార్జున కెరీర్లోనే ఈ రకంగా ఎప్పుడూ జరగలేదు. వర్మని నమ్మి ఈ చిత్రంలో నటించిన నాగార్జునకు ఈ సినిమా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.


