ఆఫీషియల్..శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్.!

Published on Jun 18, 2021 9:57 am IST

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా అంతా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరునే వినిపిస్తుంది. తాను నటించిన లేటెస్ట్ చిత్రం “జగమే తందిరం” నెట్ ఫ్లిక్స్ రిలీజ్ తో పాటుగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ అదిరే ట్రై లాంగువల్ పాన్ ఇండియన్ చిత్రాన్ని కూడా చేస్తున్నారని వచ్చిన టాక్ మరింత వైరల్ అయ్యింది.

మరి ఈ ఊహించని కాంబో నుంచి ఈరోజే అధికారిక అప్డేట్ వస్తుంది అని కూడా ఇన్ఫో రాగా దానిని మేకర్స్ నిజం చేసేసారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం తనకు చేసిన “లవ్ స్టోరీ” నిర్మాతలు సారధ్యంలో ఒక పాన్ ఇండియన్ సినిమా ఉన్నట్టుగా అధికారిక ప్రకటన ద్వారా ఖరారు చేసేసారు.

దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పై ఒక చక్కటి క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. అలాగే ఈ ప్రకటన అనంతరం వీరి నుంచి ఎలాంటి సినిమా వస్తుంది అన్నది కూడా మరింత ఆసక్తికరంగా మారిపోయింది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :