మహేష్ మ్యాజికల్ కాంబోపై ప్రకటన రావడమే తరువాయి.!

Published on Apr 15, 2021 9:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సేషనల్ కాంబోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా కొన్ని ఉన్నాయి. విజయాపజయాలకు సంబంధం లేకుండా మహేష్ తో మ్యాజిక్ చేసిన దర్శకులలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. వీరి నుంచి చేసింది రెండే సినిమాలు ఒకటి ప్లాప్ అయినా కూడా వీరి సినిమాలు సెట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఇప్పటికీ మరో లెవెల్లో ఉంది.

అందుకే ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు అన్నీ క్లియర్ అయ్యి ఈ కాంబో మళ్ళీ రిపీట్ కావడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ రాజమౌళితో చేసే సినిమా కంటే ముందు ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. దానికి గాను దర్శకుడు ఎవరు అన్న ప్రశ్నకు చాలా మంది పేర్లే వినిపించాయి.

వాటిలో త్రివిక్రమ్ ది కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా మాత్రం మహేష్ నెక్స్ట్ కు త్రివిక్రమ్ పేరే ఖరారు అయ్యినట్టుగా సినీ వర్గాలలో టాక్. మరి దీనితో ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఒక్కటి రావడమే తరువాయి అని చెప్పాలి. మరి అలాగే అది కూడా తొందరలోనే వస్తుంది అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :