“పుష్ప” పై అఫిషీయల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.!

Published on May 14, 2021 8:30 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం పై అంతే స్థాయి అంచనాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విషయంలో గత కొన్ని రోజులు నుంచి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. అదే ఈ చిత్రం విడుదల అవుతుంది అని.

అయితే ఇది నిజమే అని తెలిసింది కానీ ఈరోజు అధికారికంగా అన్ని ఇండస్ట్రీ వర్గాలలో “పుష్ప” అన్ని కీలక భాషల్లో రెండు భాగాలుగా విడుదల కావడం కన్ఫర్మ్ అయ్యిందని అధికారికంగా తెలిసింది. సో పుష్ప పై ఒక తుది క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అత్యున్నత ప్రమాణాలతో ఈ రెండు వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :