అఫిషియల్ : “RRR” ఓటీటీ రిలీజ్ కి డేట్ వచ్చేసింది.!

అఫిషియల్ : “RRR” ఓటీటీ రిలీజ్ కి డేట్ వచ్చేసింది.!

Published on May 12, 2022 7:06 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మరియు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. గా పాన్ ఇండియా లెవెల్లో RRR రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా దగ్గర ఒక హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి థియేటర్ లలో ఇప్పటికీ పలు చోట్ల మంచి రన్ ని కనబరుస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుంది అనే దానిపై ఒక డేట్ వినిపిస్తూ వచ్చింది.

మరి దాన్ని నిజం చేస్తూ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ 5 వారు అనుకున్న డేట్ ఈ మే 20నే హిందీ మినహా అన్ని భాషల్లో వస్తున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేసేసారు. దీనితో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా జీ ప్లెక్స్ లో డబ్బులు పే చేసి చూడాలన్న టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు నార్మల్ గానే వస్తున్నట్లు అర్థం అవుతుంది ఇది మంచి విషయం అని చెప్పాలి. ఇక ఓటీటీ లో ఈ చిత్రం ఎలాంటి వండర్స్ నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు