అఫీషియల్ : లెనిన్ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన నాగ్..!

అఫీషియల్ : లెనిన్ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన నాగ్..!

Published on Jun 13, 2026 5:56 PM IST

Nagarjuna-Lenin

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘లెనిన్’ చిత్ర వాయిదాపై కింగ్ నాగార్జున అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు. సినిమాను మరింత అద్భుతంగా, 100 శాతం పర్‌ఫెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం మరికొంత సమయం అడిగిందని.. వారిలో ఉన్న కసి, పట్టుదల చూసి తాను దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఈ క్రమంలోనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త విడుదల తేదీని కూడా ఆయన ప్రకటించాడు. గతంలో అనుకున్న జూన్ 26 కాకుండా, లెనిన్ జూలై 10న థియేటర్లలోకి వస్తున్నాడంటూ నాగార్జున కన్‌ఫర్మ్ చేశాడు. ఈ సినిమాతో ప్రేక్షకులు సరికొత్త అఖిల్‌ను చూస్తారని ఆయన మరోసారి కాన్ఫిడెంట్‌గా తెలిపాడు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై నాగార్జున స్వయంగా ఈ రేంజ్ నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో ‘లెనిన్’ ఎక్స్‌పీరియన్స్ కోసం అక్కినేని ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు