అఫీషియల్ : NBK 108 టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

అఫీషియల్ : NBK 108 టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

Published on Jun 5, 2023 9:00 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల వరుసగా అఖండ, వీరసింహారెడ్డి మూవీస్ తో రెండు సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న NBK 108 మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఒక కీలక పాత్ర చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది దీనిని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క టైటిల్ ని జూన్ 8 న అఫీషయల్ గా అనౌన్స్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీకి భగవత్ కేసరి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి ఫైనల్ గా ఈ మూవీకి టైటిల్ గా ఏది ఫిక్స్ చేస్తారో చూడాలి. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి రానున్న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు