అఫీషియల్: ‘మెగా 158’ కోసం ‘ఓజి’ మ్యూజిక్ డైరెక్టర్!

అఫీషియల్: ‘మెగా 158’ కోసం ‘ఓజి’ మ్యూజిక్ డైరెక్టర్!

Published on May 20, 2026 12:04 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన ఫ్యాన్ అండ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో తన 158వ సినిమా ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం మెగాస్టార్ ఊహించని డెడికేషన్ కూడా చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒకో కీలక అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

అలా నిన్ననే ప్రొడక్షన్ డిజైనర్ ని రివీల్ చేయగా ఇప్పుడు సంగీత దర్శకుడు ఎవరు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. మరి ఈ సినిమాలో ఓజి సంగీత దర్శకుడు థమన్ వర్క్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఆల్రెడీ మెగాస్టార్ తో థమన్ గాడ్ ఫాదర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దానితో పాటుగా బ్రూస్ లీ లాంటి సినిమాకి కూడా మెగాస్టార్ కి సాలిడ్ స్కోర్ ని తాను అందించాడు. పైగా బాబీతో కూడా సాలిడ్ ట్రాక్ రికార్డు తనకి ఉంది. మరి ఈ క్రేజీ కలయికలో మ్యూజికల్ గా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు