ఆఫిషియల్: పవర్ స్టార్ ‘ఓజి’ బుల్లితెర ఎంట్రీ ఈ ఛానెల్లోనే! ప్రోమో విడుదల

ఆఫిషియల్: పవర్ స్టార్ ‘ఓజి’ బుల్లితెర ఎంట్రీ ఈ ఛానెల్లోనే! ప్రోమో విడుదల

Published on Jul 21, 2026 12:30 PM IST

గత ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ నుంచి తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో కూడా వచ్చేసింది.

ఇక ఆ తర్వాత బుల్లితెర ఎంట్రీ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఏ ఛానెల్లో వస్తుంది అనేది సస్పెన్స్ గా మారింది. మధ్యలో స్టార్ మా, ఈటీవీ అంటూ పలు రూమర్స్ కూడా వినిపించాయి కానీ ఇప్పుడు అధికారికంగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం తాలూకా శాటిలైట్ హక్కులు ప్రముఖ సంస్థ ఈటీవీ వారు కొనుగోలు చేశారు.

అలానే దీనిపై అధికారిక ప్రోమో కట్ ని కూడా విడుదల చేసి అతి త్వరలోనే ఓజి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి రాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమా డేట్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ప్రియాంక మోహన్ పవన్ సరసన నటించిన సంగతి తెలిసిందే. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణం వహించారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు