వివాహబంధంలోకి అడుగు పెట్టిన సమంత !

వివాహబంధంలోకి అడుగు పెట్టిన సమంత !

Published on Dec 1, 2025 2:04 PM IST

Samatha

హీరోయిన్ సమంత వివాహబంధంలోకి అడుగు పెట్టారు. నేడు తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో సమంత-రాజ్‌ నిడిమోరు పెళ్లి జరిగింది. గతకొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాజ్‌- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్‌ల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్‌కు, ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది.

రీసెంట్ గా సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి పోస్ట్‌ పెట్టింది. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ సమక్షంలో.. గత ఏడాదిన్నరగా నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌ తీసుకున్నాను. ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నాను. ఇది కేవలం ఆరంభమే’’ అని చెప్పుకొచ్చింది. పైగా ఆ పోస్ట్‌తో పాటు ఆమె రాజ్‌ నిడిమోరుతో ఉన్న ఫొటోను కూడా పంచుకుంది. మొత్తానికి ఇప్పుడు వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి అయ్యారు.

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు