అఫీషియల్..”సీటీమార్” కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!

Published on Aug 28, 2021 3:42 pm IST


టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. టాలీవుడ్ మోస్ట్ అండర్ రేటెడ్ దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ మాస్ స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కే ఫిక్స్ చేశారు.

అయితే గత కొన్ని రోజులు కిందటే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతుంది అని ఫిక్స్ అవ్వగా పలు కారణాల చేత మేకర్స్ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే సెప్టెంబర్ 10 వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణ సంస్థ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :