మన టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నుంచి ఆల్రెడీ ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత తన నుంచి మూడో సినిమా కూడా రాబోతుంది. అయితే వీటి తర్వాత మళ్ళీ వచ్చే ఏడాది ఆరంభం లోనే మరో సినిమా కూడా వస్తుంది అని తాను ప్రామిస్ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో సాలిడ్ ఎంటర్టైనర్ ఆల్రెడీ లాక్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ ని ఖరారు చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు అప్పుడే డేట్ కూడా లాక్ చేసేసారు. అంటే ఈ 4 నెలల్లోనే సినిమా పూర్తి చేసేస్తారని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ సినిమాకి ఆల్రెడీ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి చేసేయడం విశేషం. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.


