ఓజి 2 ఓకే.. కానీ ఆ ప్రాజెక్ట్ ఏమైంది..?

ఓజి 2 ఓకే.. కానీ ఆ ప్రాజెక్ట్ ఏమైంది..?

Published on Jun 22, 2026 3:06 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ‘ఓజి 2’ సినిమా ఉంటుందని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రకటన వచ్చిన కొద్ది రోజుల్లోనే దర్శకుడు సుజిత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి ఈ చిత్ర స్క్రిప్ట్ విషయంలో డిస్కషన్ జరిపాడు. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, పవన్ ఎప్పుడో కమిట్ అయిన సురేందర్ రెడ్డి, రామ్ తాళ్ళూరి ప్రాజెక్ట్‌ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పవన్ నెక్స్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ‘ఓజి-2’ లైన్‌లోకి వచ్చింది. నిజానికి దర్శకుడు సుజిత్ నానితో ‘బ్లడీ రోమియో’ చేయాల్సి ఉంది.. కానీ, ‘ది ప్యారడైజ్’ ఆలస్యం కావడంతో నాని అందుబాటులోకి రాలేదు. దీంతో సుజిత్ దృష్టి ‘ఓజి-2’ వైపు మళ్లింది.

‘ఓజి-2’ తెరపైకి రావడంతో సురేందర్ రెడ్డి సినిమా భవితవ్యం మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. పవన్‌ను సంతృప్తి పరిచేలా స్క్రిప్ట్ రెడీ కాకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని సినీ సర్కి్ల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు