ఓజీ: ముగిసిన ముంబై షెడ్యూల్!

Published on Sep 18, 2023 5:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం దే కాల్ హిమ్ ఓజీ. తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెండు నెలల పాటు సాగిన ముంబై షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసిందని, ఫలితాలతో టీమ్ ఆనందంగా ఉందని మేకర్స్ తాజాగా అప్డేట్ వెల్లడించడం జరిగింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మరియు ఉస్తాద్ భగత్ సింగ్‌తో బిజీ షెడ్యూల్ ఉన్నందున, నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టవచ్చు.

ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :