విలక్షణతో పాటు ఎప్పుడూ భావోద్యోగాల చుట్టూ సినిమాలు తీసే సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం చేసిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఓకే బంగారం’. తమిళంలో నిర్మించిన ఈ సినిమాని తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఏప్రిల్ 17న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. అలాగే ఈ సినిమా ఫైనల్ రన్ టైం కూడా లాక్ చేసారు.
ఓకే బంగారం సినిమా టోటల్ రన్ టైం 138నిమిషాల 42 సెకన్లు(2 గంటల 19నిమిషాలు). దీని ప్రకారం మణిరత్నం సినిమాని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.


