మార్చి మధ్యలో ‘ఓకే బంగారం’ ఆడియో.

మార్చి మధ్యలో ‘ఓకే బంగారం’ ఆడియో.

Published on Mar 6, 2015 6:50 PM IST

OK-Bangaram
దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘ఓకే కన్మణి’. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియోను మార్చి రెండవ వారంతంలో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై తెలుగులో ‘ఒకే బంగారం’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను స్టూడియో గ్రీన్ సంస్థ సొంతం చేసుకుంది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి’ను నిర్మించారు.

తాజా వార్తలు