మణి ‘బంగారం’ సూపర్ అంటున్న ఫిల్మ్ సర్కిల్స్

మణి ‘బంగారం’ సూపర్ అంటున్న ఫిల్మ్ సర్కిల్స్

Published on Apr 14, 2015 10:35 AM IST

Ok-Bangaram
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు చెప్పగానే మన మదిలో కొన్ని అద్భుతమైన సినిమాలు మెదిలే దర్శకులు చాలా తక్కువ మండే ఉన్నారు. అలాంటి దర్శకులలో ముందుండే డైరెక్టర్ మణిరత్నం. ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగు, తమిళ, హిందీ సినిమాలను అందించిన మణిరత్నం గత కొన్ని సంవత్సరాలుగా విజయం అనేది చూడలేదు. కానీ మణిరత్నం చేసిన లేటెస్ట్ మూవీ ‘ఓకే బంగారం’ తో మాత్రం సూపర్ హిట్ అందుకుంటాడని అందరూ చెబుతున్నారు.

సెన్సార్ పూర్తయిన తర్వాత ఈ సినిమాని కొంతమంది తమిళ ప్రముఖులకి స్పెషల్ గా చూపించారు. వారందరూ ముక్త కంఠంతో చెబుతున్న మాట ఈ సరి మణిరత్నం తన మేజిక్ ని రిపీట్ చేసాడు, కచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటాడని అంటున్నారు. అలాగే చాలా యూత్ ఫుల్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని చెబుతున్నారు. అంతే కాకుండా ఫస్ట్ లుక్ నుంచే ప్రేక్షకులలో కూడా ఈ సినిమా పై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే చాలా రోజుల తర్వాత మణిరత్నం సినిమాకి తెలుగు, తమిళ భాషల్లో సూపర్బ్ ఓపెనింగ్స్ వస్తాయని కూడా ఆశిస్తున్నారు.

సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అనుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు