‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’ ఆడియో రిలీజ్ డేట్.

14th, July 2014 - 11:00:27 AM

Oka-Criminal-Prema-Katha-po

‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చిత్రంతో సమాజంలో జరుగుతున్న సమస్యలను సరికొత్త కోణంలో ఆవిష్కరించారు దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి.
మరోసారి ఆ తరహా కథతో సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’. జూలై 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఆడియో మంగళవారం జూలై 15న విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రసాద్ లాబ్స్ లో జరగనుంది.

మహిళలు బయటకు చెప్పుకోలేని సమస్యలను ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ కథ కోసం చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. పలు కాలేజీలలో విద్యార్ధినిలతో మాట్లాడాము, డార్క్ రొమాంటిక్ క్రైమ్ స్టొరీతో రూపొందిన ఈ సినిమాలో సందేశం కూడా ఉందని దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి అన్నారు.

ఇటివల విడుదలైన ఈ సినిమా స్టిల్స్ చర్చనీయాంశం అయ్యాయి. హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ ఫోటోలు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించాయి. ఈ లిప్ లాక్ 90 సెకన్ల పాటు సినిమాలో ఉంటుంది. మనోజ్ నందం, అనిల్ కళ్యాణ్, ప్రియాంక పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు.