ఇంట్రెస్టింగ్.. “చరణ్ 16″లో కీలక సీన్ కోసం మళ్ళీ పాత పద్దతి..

ఇంట్రెస్టింగ్.. “చరణ్ 16″లో కీలక సీన్ కోసం మళ్ళీ పాత పద్దతి..

Published on Feb 1, 2025 5:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యింది. అయితే ఈ చిత్రం తర్వాత ఇక అన్ని అంచనాలు దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న భారీ చిత్రం పైనే ఉన్నాయి.

చరణ్ కెరీర్లో 16వ సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి రంగస్థలం, దేవర, రోబో సినిమాటోగ్రఫర్ రత్నవేలు వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశం కోసం తాను మళ్ళీ పాత పద్దతిలో షూట్ చేయబోతున్నట్టుగా తెలిపారు. అప్పట్లో సినిమాలు ఇప్పుడు తరహాలో షూటింగ్ చేసేవారు కాదని తెలిసిందే.

అప్పట్లో సినిమాలు నెగిటివ్ రీల్స్ ద్వారా షూట్ చేసేవారు. మరి కాల క్రమేణా ఇది అంతరించి మొత్తం డిజిటల్ అయ్యింది. మరి ఈ పాత పద్ధతినే మళ్ళీ చరణ్ సినిమాలో ఒక పర్టిక్యులర్ సీన్ కోసం తెస్తున్నట్టుగా తెలిపారు. మొత్తం సీన్ ని ఇలానే తీయడం కష్టం అని అందుకే ఆ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. మరి ఆ సీన్ ఏంటి అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు