‘ఆదిపురుష్’ షూట్ ఆగలేదన్నమాట

Published on Apr 20, 2021 3:00 am IST

ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా రావణుడి పాత్రను సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. అయితే విజృంభిస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా బాలీవుడ్ షూటింగ్స్ అన్నీ వాయిదాపడ్డాయి. అన్నింటి లాగానే ‘ఆదిపురుష్’ కూడ వాయిదాపడిందనే వార్తలు మొదలయ్యాయి. దీంతో ప్రభాస్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే తాజాగా దర్శకుడు ఓం రౌత్ హిందీ మీరియాతో ముచ్చటించిన మాటలు వింటే సినిమా అడగలేదని అర్థమవుతోంది.

ఓం రౌత్ మాట్లాడుతూ కోవిడ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న షెడ్యూల్ మేరకు షూటింగ్ కంప్లీట్ చేయడానికి కష్టపడుతున్నామని, పరిస్థితులు కఠినంగానే ఉన్నా అన్నింటినీ తట్టుకుని పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్, సైఫ్ అలీఖాన్ అయితే తమ పాత్రల కోసం శారీరకంగా చాలా కష్టపడుతున్నారని, పాత్రలకు తగిన లుక్ మైంటైన్ చేయడానికి ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారని అన్నారు.

సెట్లో మాస్క్ తప్పనిసరి చేశామని, చాలా కఠిన నిబంధనలు పాటిస్తున్నామని, ఇప్పటికే 30 శాతం షూటింగ్ ముగిసిందని, ముందు ముందు ఇంకా చాలా కష్టపడాల్సి ఉందని, కోవిడ్ భయం తమలోని స్ఫూర్తిని బలహీనపరచలేదని చాలా ధీమాగా మాట్లాడారు. ఆయన మాటల్ని బట్టి చిత్రీకరణ కొనసాగుతోందనే అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :