తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసుకుని రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఐతే, మార్చి 4న ఓటీటీలో అరంగేట్రం చేయడానికి ఈ సినిమా రెడీ అయింది. మోగుడు-పెళ్లాం మద్య ఈగో క్లాష్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏ.ఆర్.సజీవ్ డైరెక్ట్ చేశారు.
ఆహా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను కలిగి ఉంది. ఇక ఈ సినిమాని చూడటానికి ‘ఆహా’ గోల్డ్ సబ్‌స్క్రైబర్ లకు 24 గంటల ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. జే క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాదిక్ షేక్, నవీన్ శనివారపు ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో విజయం సాధిస్తోందో చూడాలి.
