
ఫేమస్ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి చేసిన ‘జీనియస్’ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా, రెండవ ప్రయత్నం గా చేసిన రాజుగారి గది మాత్రం ఓంకార్ కి మంచి విజయాన్ని అందించింది. ఓంకార్ ఈ సినిమా ట్రైలర్ తోనే మెప్పించడంతో వారాహి చలన చిత్రం మరియు ఏకె ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు వచ్చి ఈ సినిమాని కొనుక్కొని వారే సినిమాని రిలీజ్ చేసారు. దాసా కానుకగా గత గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది.
మొదటి నాలుగు రోజుల్లోనే చాలా ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అంతా సేవ్ అయిపోవడమే కాకుండా లాభాలను కూడా అందుకుంటున్నారు. మొదటి వారం కల్లా అన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చి పెడుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాని రిలేజే చేసిన వారాహి చలన చిత్రం, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారికి కూడా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. దీంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఓంకార్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ సుంకర ఈ విషయంపై ఓంకార్ తో చర్చలు జరిపి ఓ మీడియం బడ్జెట్ సినిమా చేయడానికి సిద్దం అయ్యాడట. ఆ ఆఫర్ విషయంలో ఓంకార్ కూడా సముఖతగానే ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఓంకార్ – అనిల్ సుంకరలు తమ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

