“సలార్” నుంచి శృతి హాసన్ బర్త్ డే స్పెషల్ పోస్ట్.!

“సలార్” నుంచి శృతి హాసన్ బర్త్ డే స్పెషల్ పోస్ట్.!

Published on Jan 28, 2022 10:47 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “సలార్” కూడా ఒకటి. ప్రభాస్ మాస్ కటౌట్ కి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాలో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి శృతి హాసన్ తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ గత ఏడాది రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరి ఈసారి ఈరోజు శృతి హాసన్ బర్త్ డే కానుకగా కొత్త లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీనితో పాటుగా ఈమె పాత్ర పేరేంటో కూడా తెలియజేసారు. మరి ఈ చిత్రంలో శృతి హాసన్ “ఆద్య” అనే రోల్ లో కనిపిస్తుందట. మరి అలాగే తన లుక్ కూడా చాలా సింపుల్ గా కనిపిస్తుంది. మరి సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు