“పుష్ప”లో స్పెషల్ సాంగ్ కు మళ్ళీ మార్పు.?

Published on Jan 27, 2021 3:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. అల్లు అర్జున్ మొట్ట మొదటగా పాన్ ఇండియన్ వైడ్ అడుగు పెట్టబోతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.

మరి అందుకు తగ్గట్టుగానే సుకుమార్ ప్రతీ ఎలిమెంట్ ను ఆ రేంజ్ లో ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ తో చేయనున్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మరికొన్ని పేర్లు కూడా వినిపించాయి.

కానీ ఇప్పుడు మరో క్రేజీ నటి పేరు వినిపిస్తుంది. ఆమెనే గ్లామరస్ నటి ఊర్వశి రౌటేలా. ఈమెను సుకుమార్ స్పెషల్ సాంగ్ కు లాక్ చేసినట్టుగా గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :