మెగాస్టార్ కాస్ట్లీ మిస్ కోసం మరోసారి డిస్కషన్!

మెగాస్టార్ కాస్ట్లీ మిస్ కోసం మరోసారి డిస్కషన్!

Published on Jun 16, 2026 6:06 PM IST

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లతో పాటుగా పలు ప్లాప్ లు కూడా చూడాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాల్లో మెగాస్టార్ మిస్ చేసుకున్న కాస్ట్లీ మిస్ కోసం మరోసారి డిస్కషన్ మొదలైంది. చిరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓటీటీలో సెన్సేషనల్ హిట్ అయ్యిన సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అసలు మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన సిరీస్ అని రివీల్ అయ్యింది.

అయితే రీసెంట్ గానే సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్ లో సామ్ భర్త రాజ్ నిడుమోరు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని సినిమాగా మెగాస్టార్ తో అనుకున్నామని కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలిపారు. దీనితో ఈ కాస్ట్లీ మిస్ కోసం మరోసారి సినిమా అభిమానుల్లో డిస్కషన్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రం చేసి ఉంటే మెగాస్టార్ క్రేజ్ మరింత లెవెల్లో పెరిగి ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు