మరోసారి మాధవన్ తో నటించనున్న బాలీవుడ్ బ్యూటీ!

Published on Jun 5, 2023 3:02 pm IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరొకసారి మాధవన్ తో స్క్రీన్ ను షేర్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తను వెడ్స్ మను చిత్రం తో సూపర్ సక్సెస్ గా ఈ జంట నిలిచింది. అయితే దాని సీక్వెల్‌ కోసం మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. తాజా సంచలనం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కి ప్రఖ్యాత ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మాణం వహించనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం, కంగనా తన రాబోయే తమిళ చిత్రం చంద్రముఖి 2 షూటింగ్‌లో బిజిగా ఉంది. ఆమె మరో చిత్రం ఎమర్జెన్సీ చిత్రీకరణను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరోవైపు, మాధవన్ తన స్పోర్ట్స్ డ్రామా టెస్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :