కొండారెడ్డి బురుజు సెంటర్ లో ఓబుల్ రెడ్డిని కొట్టిన ఒకే ‘ఒక్కడు’.

Published on Sep 23, 2019 12:03 pm IST

దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కర్నూల్ లోని కొండా రెడ్డి బురుజు సెంటర్ సెట్టింగ్ ని రామోజీ ఫిలిం సిటీలో నిర్మించడం జరిగింది. కాగా దర్శకుడు అనిల్ ఆ సెట్ లో మహేష్ ఉన్న ఫోటోని ట్వీట్ చేస్తూ 16ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఒక్కడు చిత్రాన్ని ప్రస్తావించారు.

2003లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఒక్కడు చిత్రం మహేష్ కెరీర్ లోనే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ టేకింగ్, మరియు మణిశర్మ సంగీతం ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఒక్కడు చిత్రంలో అజయ్ గా చేసిన మహేష్ తన కబడ్డీ టోర్నమెంట్ కోసం కర్నూల్ వెళతాడు. అక్కడ స్వప్న(భూమిక)ను కొండారెడ్డి బురుజు సెంటర్ లో ఫ్యాక్షనిస్ట్ ఓబుల్ రెడ్డి(ప్రకాష్ రాజ్) ఈడ్చుకెళుతూ ఉంటాడు. అది చూసిన అజయ్ ఓబుల్ రెడ్డి ని కొట్టి అక్కడికి నుండి స్వప్నతో పారిపోతాడు. “కొండారెడ్డి బురుజు సెంటర్లో ఓబుల్ రెడ్డి ని కొట్టాడా…! ఖచ్చితంగా మనూరోడైతే కాదు…,” అనేది అప్పట్లో ఫేమస్ డైలాగ్.

మళ్ళీ 16ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరూ చిత్రం కొరకు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో షూటింగ్ చేస్తున్నాడు మహేష్. మరి ఒక్కడు సెంటిమెంట్ కలిసొచ్చి మహేష్ ఇండస్ట్రీ హిట్ అందుకుంటాడేమో చూడాలి. సరిలేరు నీకెవ్వరూ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుందని ప్రాథమిక సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More