డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!

డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!

Published on Aug 26, 2026 6:55 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పలు ఐకాన్ సినిమాల్లో దర్శకుడు విష్ణు వర్ధన్ తో చేసిన స్టైలిష్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ‘పంజా’ కూడా ఒకటి. 2011 లో ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గానే నిలిచింది. అప్పట్లో పవన్ ఎన్నో ప్లాప్స్ లో ఉన్నప్పటికీ ఈ సినిమా సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు.

మరి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత పంజా మేనియా మళ్ళీ అభిమానుల్లో కనిపిస్తుంది. ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ప్లాన్ చేసిన ఈ రీరిలీజ్ తాలూకా బుకింగ్ లేటెస్ట్ గా మొదలయ్యాయి. ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా కేవలం నాలుగే షోస్ ఓపెన్ అయితే ఈ నాలుగు షోస్ తోనే బుక్ మై షోలో ట్రెండింగ్ కి వచ్చేసింది.

ఇక ప్రస్తుతం గంటకి 2 వేల 700 టికెట్స్ కి పైగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇదంతా ఓ డిజాస్టర్ సినిమాకి కావడం గమనార్హం. మరి ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ నాటికి ఈ సినిమా ఎలాంటి నంబర్స్ సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఆర్కా మీడియా సంస్థ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు