మరోసారి సుశాంత్ సింగ్ పేరు మారు మోగుతుంది.!

Published on Oct 30, 2020 1:00 pm IST

గత కొన్నాళ్ల కితం బాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యా ఘటన పెద్ద సంచలనం రేపింది. అక్కడ నుంచి ఎన్నో మలుపులు తిరిగి రోజుకో కొత్త ట్విస్ట్ ను చోటు చేసుకునేది. అదే క్రమంలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా బయటకొచ్చాయి.

అది హత్యా లేక ఆత్మ హత్యా అని రెండు కోణాల్లో కొనసాగుతూ ఈ మధ్యనే ఒక కొలిక్కి వచ్చినట్టు అయ్యింది. కానీ అక్కడి నుంచి మరుగున పడిపోయిన సుశాంత్ మరణం మిస్టరీ ఇప్పుడు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సుశాంత్ ను ఎవరు చంపారు అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చెయ్యడం ఆశ్చర్యకరంగా మారింది.

అలాగే ఇక్కడే మరో ఊహించని అంశం ఏమిటంటే వచ్చే నవంబర్ 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్ రోడ్ లో ప్రొటెస్ట్ మరియు కాండిల్ ర్యాలీ చేయనున్నారట. మళ్ళీ అకస్మాత్తుగా సుశాంత్ కు న్యాయం జరగాలని లక్షల్లో ట్వీట్లతో ఎందుకు ట్రెండ్ అవుతుందో అన్నది తెలియరాలేదు.

సంబంధిత సమాచారం :

More