“వకీల్ సాబ్” కు మళ్ళీ తప్పని చిక్కులు.!

“వకీల్ సాబ్” కు మళ్ళీ తప్పని చిక్కులు.!

Published on Dec 16, 2020 11:00 PM IST

Vakeel Saab1 1

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా లీకుల బెడద మాత్రం పోవడం లేదు.

అప్పుడు ఆన్ లొకేషన్ లో పవన్ ఉన్న ఫోటోలు బయటకు వచ్చేసి శరవేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. మళ్ళీ ఆ తర్వాత కూడా అలానే జరిగాయి. మళ్ళీ ఇప్పుడు పవన్ షూట్ మొదలు పెట్టడంతో అక్కడ నుంచి కూడా సోషల్ మీడియాలో ఫోటోలు బయటకు వచ్చేసాయి..

పైగా వాటిని పవన్ అభిమానులే చాలా మంది జోరుగా ప్రసారం చేసుకుంటూ ఉండడం గమనార్హం. దీనితో ఇతర అభిమానులు మేకర్స్ లొకేషన్ ఏం చేస్తున్నారో అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని సార్లు ఫోటోలు వీడియోలు వచ్చేస్తున్నా మేకర్స్ ఎందుకు వాటిని కట్టడి చెయ్యలేకపోతున్నారో అన్నది వారికే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు