జీవితంలో ఒక్కసారి – ‘బాహుబలి’పై తమన్నా.

జీవితంలో ఒక్కసారి – ‘బాహుబలి’పై తమన్నా.

Published on Nov 14, 2014 4:53 PM IST

Tamanna
‘జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది నాకు చాలా ఎగ్జైటింగ్ సినిమా. నాకు ‘బాహుబలి’లో నటించే అవకాశం కల్పించినందుకు రాజమౌళి గారికి కృతజ్ఞతలు. అతనొక జీనియస్’ అంటూ ప్రతిష్టాత్మక సినిమా గురించి చెప్తూ ఎగ్జైట్ అయ్యింది మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్ ఆరంభం నుండి ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలలో గ్లామరస్ క్యారెక్టర్స్ లో కనిపించిన తమన్నా తొలిసారిగా ఒక చారిత్రాత్మక సినిమాలో నటిస్తుంది.

ప్రభాస్, అనుష్క, రానా ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘బాహుబలి’ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. 180 కోట్ల బడ్జెట్ తో తెరకేక్కుతుందని సమాచారం. యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు.

తాజా వార్తలు