మెగాస్టార్ టైటిల్ తో అప్పుడు విలన్ ఇప్పుడు హీరోగా.!

Published on Jun 20, 2021 4:00 pm IST

తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ మంచి మార్క్ సెట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత నుంచి కూడా ఒక్క హీరో గానే నెగిటివ్ రోల్స్ కూడా చేసి వాటిని అద్భుతంగా పండించి మరిన్ని మన్ననలు అందుకున్నాడు. మరి రీసెంట్ గానే “చావు కబురు చల్లగా” సినిమాతో పలకరించిన ఈ హీరో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

అయితే వాటిలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్ కావడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిని అని చెప్పుకుంటూ వస్తున్న కార్తికేయ ఇది వరకే మెగాటీసర్ సూపర్ హిట్ చిత్రం “గ్యాంగ్ లీడర్” టైటిల్ తో నాని హీరోగా నటించిన చిత్రంలో సాలిడ్ విలన్ గా కనిపించాడు.

మరి ఇపుడు తన కొత్త సినిమాకు మరోసారి మెగాస్టార్ టైటిల్ “రాజా విక్రమార్క” అంటూ హీరోగా సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో కార్తికేయ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు. మరి అప్పుడు విలన్ గా వచ్చి ప్రశంసలు అందుకున్న కార్తికేయ హీరోగా ఎలా కనిపించనున్నాడో చూడాలి.

ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్.ఆర్.విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి,శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు,నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

సంబంధిత సమాచారం :